SIRIndipity
accidental ga incidental ga dorikina SIRI ni pravesapettalane mukhyoddesam tho... sarcasm, wits, language quality kosam keep staring... :)
Monday, January 23, 2012
chalipuli
ఇదిగో వచ్చేసింది...!! చలికాలం కోసం ఎంత ఎదురుచూస్తామో ఆ గ్రీష్ముడికే తెలుసు.
అలా న్యూస్ పేపర్ తిరగేస్తే తెలుస్తుంది.. అనంతపూర్ లో లిటెరసీ రేట్ పడిపోయినట్టు పడిపోతోంది టెంపరేచరు.
జన్ లోక్పాల్ బిల్, ప్రధాన మంత్రి పరదేశ పర్యటనలు, ఇవేవీ కనిపించకపోయినా చలిపులి column మాత్రం ఖచ్చితంగా కంట పడుతుంది.
అనుమానం పెనుభూతం అంటారు. చలిపులి column చూసిన ప్రత్తి సారీ ఓ అనుమానం వస్తుంది.. అసలు చలి "పులి" అని ఎందుకు సంబోధించాడా అని..
బహుశా, పులి చర్మానికి చారలు ఎలా అయితే ఉంటాయో, చలి వల్ల మన చర్మానికి కూడా చారలొస్తాయని కాబోలు..
అలా కాకుండా, కొరికేసేదే అయితే, ఏ చలి సిమ్హమో, చలి గ్రామసిమ్హమో అనేవారు కదా..!!
మొత్తానికి ఈ పులిని చూసి మనకి ఉన్న వాతలను చెరుపుకోడానికి, moisturizers లాంటివి వాడకపోతే, మనుషులు ఇంక మనుషులు కారు...!!
(గూగుల్ ఆడ్సెన్స్ ఉంటే, ఇక్కడ vaseline/lakme ఆడ్స్ వచ్చేవేమో... :P
అన్నట్టు moisturizer అంటే గుర్తొచ్చింది... వెధవది ఒక డబ్బా కొని రెండు మూడు సంవత్సరాలైనా అవలేదు, అప్పుడే ఇంకో చలి కాలం, ఇంకో సారి కొనాల్సొచ్చే అవసరం.. రెండూ వచ్చాయి...
ఛలో ఢిల్లీ...ఛలో హైదరాబాదు మొదలగు SFI వారి నినాదాలు చదువుకుంటూ, ఛలో సూపర్ మార్కెట్ అని మోర్ కి వెళ్ళాను..
మోర్ అని బిర్లాలు ఎం ఆలోచించి సార్ధక-నామకరణం చేసారో కానీ.. అలాంటి షాపుల్లో కొన్న 'most' వస్తువులు అనవసరమైనవే ఉంటాయి..!
షాప్ కి వెళ్ళే దారంతా ఎర్ర తివాచీ (red carpet) పరిచి ఉంటాయి...మోర్ వారి ఎరుపు రంగుpamphlets తో..
అమ్మో!! సరస్వతీ దేవి.. ప్చ్..ప్చ్ అని చెంపలు వాచిపోయేలా లెంపలు వేసుకుంటూ చిన్నప్పుడు ఆడిన ఆటలను గుర్తుచేసుకుంటూ, కాగితం లేని చోట అడుగు వేస్తూ, బ్యాలన్స్ తప్పకుండా చూసుకుంటూ, చున్నీ, జుట్టు సరి చేసుకుంటూ, గ్రీన్ పీస్ బ్యాగ్ చంకలో సర్దుకుంటూ, ఈశ్వర కటాక్షం చేత షాప్ లోపలికి అనుక్రమించాను.
కావలసిన ఒక వస్తువు తో పాటు అక్కరలేని పన్నెండు వస్తువులు కొందామని 'MORE' super market ని అలా ఒక రౌండ్ దృష్టి పారించాను.
అక్కడ వాడు డిస్ప్లే చేసిన అఫర్లకి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి...
ముందుగా నాకు కావలసిన moisturizer ఉన్న క్రమం లోకి వెళ్ళాను.
"buy 2kg vaseline body lotion and get 5gm vaseline lip care absolutely free..!!"
ఆ ఆఫర్ చూసి, ఇలాంటి ఉచితావకాశం మళ్ళీ నా జన్మలో తిరిగి రాదు అని 2 కేజీ డబ్బాలు మూడు కొని, 15గ్రాం ల లిప్ కేర్ ని ఫ్రీ గా పొందవచ్చని సంతోషించాను...
ఆ సంతోషం తో నాకు కొత్త స్ఫూర్తి కలిగింది.. ఇంకా ఇంకా అదే.. మోర్ మోర్ ష్యాపింగ్ చెసెయ్యాలని ఏ ఒక్క క్రమమూ తప్పకుండా అక్కర్లేని వస్తువుల్లో కావలసినవి వెతుక్కుంటున్నాను...
కనీసం ఆఫర్లయినా పై ఆఫర్ లాంటివి ఉంటే కొనేయాలని క్రెడిట్ కార్డ్, చెక్ బుక్ చేత పట్టుకు తిరుగుతున్నాను...
అలా చూడగా, ఈ క్రింది ఆఫర్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
1. Buy 10kg Basmati rice for Just Rs.500/- only 499.00
(ఒక్క రూపాయి కోసం పది కేజీ ల బాస్మతి రైస్ కొనాలంటారా అధ్యక్షా??)
2. Buy 5 santoor soaps and get a pen worth Rs.5/- Free.
(ఎంత ఫ్రీ పెన్ అయినా, ఐదు సంతూర్ సబ్బులు కొనే D for ధైర్యం ఎవరికి ఉంటుంది??)
3. get 5/- off on 8 pc steel containers of worth rupees 800/-
(No comments)
4.Buy 5 tomato knorr soups and get 1 tomato knorr soup packet Free.
(ఈ మధ్య మనం చూసేవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే. వారికి ఐదేసి ప్యాకెట్లు అది కుడా కేవలం tomato soup దండుగ అనుకుంటే దానికి ఫ్రీగా ఇంకో tomato సూప్ ప్యాకెట్ ఆఫరే ఇచ్చి చచ్చాడు..హుహ్..)
ఇలాంటి అరుదుగా దొరికే ఆఫర్స్ లో దేన్ని పరిగణించాలో అర్థమవక ఉక్కిరిబిక్కిరి అయిపోయాను.
ఎలాగో వచ్చాను కదా అని, ఓ మూడు బిస్కెట్ ప్యాకెట్లు, రెండు రియల్ జ్యూస్ డబ్బాలు, చిన్న కిస్-మిస్ పళ్ళ ప్యాకెట్ ఒకటి, భలే ముద్దుగా (క్యూట్ గా) ఉందని ఒక పెన్ స్టాండు, ఖాలీగా ఉంచడమెందుకని దాంట్లోకి ఓ పెన్ను, ఒక ఇరేజరు, కాలుష్యం దాడికి భయపడి తాలీబన్ల లా తయారవడానికి ఒక స్కార్ఫు, మా వారు అసహ్యించుకుంటారని తెలిసి కూడా ఒక మంకీ క్యాప్, వేసుకోడానికి సాగదీస్తే చిరిగిపోయే లాంటి నాసిరకం సాక్స్ జత ఒకటి, రాబోయే వేసం కాలానికి ఒక షవర్-టు-షవర్ కొన్నాను.
కిలోమీటరు పొడుగు ఉన్న బిల్ కౌంటరు దగ్గర, sorry దూరంగా నిలబడి ఇటు పక్క ఉన్న ఒక orbit డబ్బా, అటు పక్క ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ ear buds ప్యాకెట్లు, ముందు వాడు బిల్ల్ చూసి, బెంబేలెత్తి, బైటపడేసిన 7'0 clock బ్లేడ్ ప్యాకెట్. వెరసి నా more షాపింగ్ పూర్తైంది అనిపించుకున్నాను...!!
ఒక్కొక్క సామాను బిల్లు పరుస్తూ, 2 మీటర్ల పొడుగు బిల్లు పేపర్ నా చేతిలో పెట్టి, అదే చెత్తో నా చేతిలో ఉన్న ఆ కార్డ్ ని తీసుకున్నాడు.
సంతోషంగా ఆ నాలుగు వేలూ బిల్ కట్టేసి, రైల్వే స్టేషన్ కూలీ లాగ, భుజానికో కవరు, మోచేతికో కవరు, నెత్తి మీద ఒక కవరు, ఇంకో భుజానికి, మోచేతికీ తగిలించుకోగా మిగిలిన రెండు కవర్లు, plus జారిపోయే చున్నీ, గాలికి రేగే జుట్టు సర్దుకుంటూ, మూడో చెయ్యి ఉంటే బగుండేది...ఈ హాండ్ బ్యాగ్ తగిలించుకోవచ్చు అనుకుంటూ. గెట్-సెట్-గో అని ఇంక నిష్క్రమించే టైం కి, సినిమా పెళ్ళిళ్ళలో ఆపండీ అన్నట్టు, నా మొబైల్ 'మ్రోగింది కళ్యాణ వీణా' అని వాయించింది.
ఎక్కడ నుంచి, ఎలా తియ్యాలో తెలియక, 'ఇప్పుడు నేను ఇంత అర్జెంట్ గా కాల్ ఆన్సర్ చెయ్యకపోతే సెన్సెక్స్ లో పాయింట్లు ఏమీ తగ్గిపోవులే' అని కుంటుకుంటూ, రెడ్ కార్పెట్ తొక్కకుండా దాటుకుంటూ ఇంటికి చేరాను...
మళ్ళీ కళ్యాణ వీణ మ్రోగింది... మా వారు.. :D
మోర్ లో ఇప్పుడేం షాపింగ్ చేసావే అని అడిగేసారు..
చలి కాలం కదా... moisturizer కొందామని వెళ్ళాను.. అమోఘమయిన ఆఫర్స్ చూసి, చిన్న షాపింగ్ చేసాను అన్నాను.
"తెలుసులే.. పెద్ద షాపింగే చెసావ్. మెసేజ్ వచ్చింది ICICI నుంచి" అన్నారు...
ఏదో అలా సామాన్లు సర్దుకుంటూ మట్లాడుకుంటూ చూసాను.
అయ్య నా మతి మండా... ఇంతకీ, moisturizer మర్చిపోయాను... మీరు వస్తూ వస్తూ, మోర్ లో 2kg డబ్బాలు 3 తెండి... 15gm లిప్ కేర్ ఫ్రీ..
టేక్కేర్. లవ్యూ అని చెప్పి కాల్ కట్ చేసా..
పులి రాజా కి ఎయిడ్స్ వస్తుందో లేదో తెలీదు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుందో లేదో కూడా తెలీదు కాని
చలిపులి ని చూసి ఇలా షాపింగ్ చేస్తే మాత్రం, నా చర్మం మీద పడ్డ చారల వలన గుండెపోటు వచ్చేలా ఉంది...!!
మీరేమంటారు??
-శిరి.
Thursday, July 1, 2010
The Wednesday...:)
మంగళవారం పని ముగించుకుని, next day, అనగా బుధవారం శెలవు తీసుకుందామని decide అయిన కార్తీక్, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
వాళ్ళ ఆవిడ, "ఎవండీ... ఎవరెవరో తలుపు తడుతుంటారు, కాల్స్ చేస్తుంటారు. "don't respond much. have a nice day. I would suggest ya to go out. believe me. that's much more better" అంటుంది.
లేదు. 'am happy"..' అనుకుని, బుధవారం అవగానే, లేచి, మిసెస్ కార్తీక్ ని ఆఫీస్ కి పంపించి, ఇంట్లో స్పెండ్ చేద్దామనుకుంటాడు. టైం సరిపోతే, రాత్రి తను వచ్చేసరికీ వంట చేసి, సర్ప్రైజ్ కూడా ఇద్దామనుకుంటాడు.
కాఫీ తెచ్చుకుని, సోఫా లో కూర్చుని రెమోట్ తో T.V. ఆన్ చేసాడు.
'టింగ్...టోంగ్'
ఎవరో వచ్చారు...
"సార్... వి ఆర్ ఫ్రం సువర్ణ భూమి... మా Ad చూసే ఉంటారు. ఎస్.పీ.బీ, కె.విశ్వనాథ్ వస్తారు కదా... అదే... రియల్ ఎస్టేట్ సార్... ఈ నెల 30th లోపు బుక్ చేస్కుంటే 80,000 డిస్కౌంట్ లభిస్తుంది సార్..." అని ఒక పుస్తకం, పెన్ను చేత పుచ్చుకుని మిస్టర్ డీసెంట్ లా ఒకడు తలుపు తట్టాడు.
'అవసరం లేదయ్యా... నాట్ ఇంట్రెస్టెడ్"
"సరే... పోనీ మీ ఫోన్ నంబర్ అయినా ఇవ్వండి సార్..."
"ఎందుకు...?? నాకు ఇంక అలా sms లు పంపించడానికేనా...??"
"హ హ... అవును సార్. కానీ, లేటెస్ట్ ఆఫర్స్ తెలుస్తాయి కదా సార్..."
"నో థాంక్స్."
<< door shut...>>
చల్లారిపోయిన కాఫీ ని ఒక చేత్తో నిళ్ళు తాగినట్టు తాగి, ఇంకో చేత్తో రిమోట్ చేత పుచ్చుకుని రెండు బటన్లు నొక్కాడు.
చానెల్ : 28
"అర్రే... ఇవాళ బ్రజిల్ ఆర్జెంటినా సాకర్ మ్యాచ్ ఉంది కదా... చ... ఇలా మర్చిపోయానేంటీ...?? " అనుకుని, 25నిముషాల మ్యాచ్ అయిపోయిన తరువాత కంటిన్యూ చేస్తున్నాడు కార్తీక్.
టైం అప్పుడు పదకొండు గంటలయింది. పుసుక్కున కరంట్ పొయింది... "ఫ్రీక్" అని ఎదురుగా ఉన్న గోడ గడియారం సెకండ్ ముల్లు, మినట్స్ ముల్లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని చూస్తున్నాడు. హవర్ ముల్లు పని చేస్తోందో లేదో తెలిసే టైం కి కుసుప్ప్ అని పోయిన కరంట్ వచ్చేసింది.
ఆర్జెంటినా ఆఖరి 25నిమిషాలు ఫినిష్ చేసాడు.
టైం అప్పుడు 12.00 అయింది. ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు ప్రత్తి చానెల్స్ లో కూడా ఒకటే ప్రోగ్రాం. వంట-వార్పు, ఘుమఘుమలు, మా ఓర్లో మీ వంట-మీ ఓర్లో మా పెంట వంటి అధునాతన ప్రోగ్రాంస్ చూడలేక, వందవ చానెల్ పెడితే, మంతెన సత్యనారాయణ గారి అజీర్తి వాస్తవాలు వస్తున్నాయి.
పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యని కార్తీక్ కి ఆ ప్రోగ్రాంస్ అనవసరం అనిపించి, T.V. ఆపేసి, కాసేపు పేపర్ తిరగేద్దామనుకున్నాడు.
పేజి 1 నుంచీ పేజి 18 వరకు ఒకే వార్త కన్సిస్టెంట్ గా కలర్ఫుల్గా కనిపించింది. 'ఓబిచ్యూరీ'. ఒక లుక్కు పారేసి, 'అబ్బా... ఎవడ్రా బాబూ... ఇంకేవీ దొరకనట్టు... ' అని చిరాకు పడినా ఉపయోగం లేదని గ్రహించి, కాసేపు నిద్రపోదాం అనుకుంటాడు. గుర్ర్ ర్ర్ ర్ర్ అని ఎదో చప్పుడు వస్తూనే ఉంది. ఎంటా అని కనుక్కుంటే తెలిసింది... పక్కన కొత్తగా కట్టే apartmentకి బోర్ త్రవ్వుతున్నారూ అని...
వెధవది... ఇవాళే వాడు ముహూర్తం పెట్టుకోవాలా అని తిట్టుకుని, చెవ్వుల్లో దూదులు పెట్టుకున్నాడు. రెండు తలగడాలలో మొహాన్ని గట్టిగా కప్పుకున్నాడు. ఇంకొంచం ఉంటే ఊపిరి ఆడడం మానేస్తుంది తప్ప చప్పుడు వినపడక మానదు, ఆ పేపర్ లో అమాంతం నా ఫోటో ఎందుకులే అని అనుకుని, దేవుడా ఒక్క 5 నిముషాలు అయినా ఆపించు స్వామీ అని ఆ మంచం మీదే పొర్లు దండాలు పెట్టి, కళ్ళ రెప్పలతో పాటు, చెవుల మూతలు కూడా ఇచ్చి ఉండాల్సింది అని design engineer style లో requirement specification ni enhance చేస్తున్నాడు పాపం కార్తీక్... :) ఈ రోజుకి ఆఫీసులో చేయాల్సిన పని ఇంట్లోనే పూర్తి చేసాడు కార్తీక్.
చెవుల్లో దూదులు పెట్టుకున్న కారణం చేత కాబోలు చాలా గట్టిగా దేవుడిని వేడుకోవడం వలన... తక్షణం అనుగ్రహించాడు దేవుడు...
సౌండ్ ఆగింది. సరే ఎదో తినాలి కదా అనుకున్నాడు. మిసెస్ కార్తీక్ వండిన విందు హాయిగా తిన్నాడు.
టీ.వీ. లో జెమిని, ఈ టివీ, మా టీవీ సీరియల్స్ చూస్తుండగా...
మళ్ళీ 'టింగ్...టోంగ్'
'హల్లో అండీ... నేను 402 లో ఉంటున్నా... ఇవాళ మీరు ఇంట్లోనే ఉన్నారా...?' -ఆవిడ
'ఒహో... ఒకే...యా... యెస్స్ ' - కార్తీక్
'మరేం లేదు. పక్కనే ఒక షాప్ లో కొన్ని సామాలు కొనాలి. మా పాప పడుకుంది. మీరు ఒక్క 10మినట్స్ చూస్కుంటే చాలు. నేను వచ్చెస్తా... ప్లీజ్ ప్లీజ్' అని వేడుకుంది ఆవిడ.
నో అందామంటే చంటి పిల్ల... మనసు రాక, సరే అన్నాడు...కార్తీక్
ఇలా వెళ్ళిందో లెదో, చంటిది లేచి, రక రకాల రాగాలు ఆలాపించడం మొదలెట్టింది. పాపం కార్తీక్ కా అలవాటు లేదాయే...
గతంలో చూసిన 'bad parenting' మెయిల్స్ గుర్తు తెచ్చుకుని, ఇలా చెయ్యకూడదు అని తెలుసుకుని, తనకి తోచిన విధంగా బుజ్జగిస్తున్నాడు కార్తీక్.
10నిమిషాలయి గంటన్నర కూడా ఐంది. వాళ్ళ అమ్మ ఇంకా రాదూ... ఫోన్ చేద్దామంటే మొట్టమొదటి సారిగా చూస్తున్నా 'lady' ని ఎలా అడిగెస్తాం అని మొహమాటం అడ్డొచ్చింది. గత్యంతరం లేక, వెయిట్ చేస్తున్నాడు.
ఇంట్లో, ఎదో మూల ఉన్న షో కేస్ మూలన ఉన్న చిన్న చిన్న ఏనుగు, పిల్లి, కుందేలు బొమ్మలు చూపించి, పులి వేషాలు వేసి, గుమ్మాడి ఎక్కించుకుని, పాలు తాగించి, బిస్కెట్ తినిపించీ... నిద్ర పుచ్చటానికి, 'please forgive me..' 'welcome to the hotel california' వంటి, తనకొచ్చిన english లాలి పాటలు పాడి, నిద్ర పుచ్చాడు కార్తీక్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, మళ్ళీ "హల్లో అండీ... నేను 402 లో ఉంటున్నా... మా పాపా..." అంది...
"కళ్ళల్లోంచి కారిన నీళ్ళు తుడుచుకుంటూ, మూడు గంటల దత్త పుత్రికను అప్పగిస్తూ, జాగ్రత్తలు చెప్పి, మళ్ళీ తలుపు మూసుకుంటాడు.
నడుం పట్టేసింది. మళ్ళీ 'టింగ్...టోంగ్'...
అబ్బా.. మళ్ళీ ఎవడ్రా.. అని చిరాకు మొహం పెట్టి..'ప్చ్...' అని తలుపు తీస్తే, అది సంధ్య...
"guess you had a bad day home" అని అంటుంది.
నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటావే అని దగ్గర తీసుకుని, తన 'bad day' గురించి చెప్తాడు, తన భార్య అయిన సంధ్య తో...
హ హ హ... అనగనగా ఒక రోజు... చాలా బాగుంది.
అందుకే.. ఉత్తి పుణ్యానికి ఇలా పనులు మానేయకు... కావాలంటే, మీ ఊరు వెళ్ళు అని చెఫ్ఫాను కదా... అంది.
నిస్సహాయుడయిన కర్తీక్... అన్నట్టు 402 లో పాపాయి ఎలా ఉందో ఎమో... వాళ్ళ అమ్మ బొత్తిగా పట్టించుకోదూ... కళ్యాణి లో వాళ్ళ పిన్ని కూడా అంతే...రేపేమవుతుందో మధుమాలిని ఇంకా ఇంటికి రాలేదు తెలుసా...అని అలోచనల్లో పడతాడు కార్తీక్...
ఇది చూసి ఆశ్చర్యంలో పడిన సంధ్య, కార్తీక్ ని ఒక్క ఉరుము కుదిపి, 'ఇవాళ dinner బైట చేద్దాం' అని కార్తీక్ ని మాములు మనిషిని చేస్తుంది.
మళ్ళీ తెల్లారిన తరువాత, 'ఏం కార్తీక్... ఇవాళ కూడా లీవ్ తీసుకుంటావా..?' అని వెటకారాలు అడిన సంధ్య తో కార్తీక్ అంటాడు...
"పొరపాటున కూడా ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఉన్న తెలివి కూడా పోయి, సీరియల్ charactersఅవుతాము" అని అనగనగా ఆ రోజుని అప్పుడప్పుదు తలుచుకుని నవ్వుకుంటారు... :)
మీరేమంటారు...?? right or wrong??
-శిరీష
Monday, March 15, 2010
లింగవిబేధాలు
ఒకాయన : నీ పేరేంటమ్మా?
నేను : నా పేరు శిరి.
ఒకాయన : ఏం క్లాసు?
నేను : ఎప్పుడు?
ఒకాయన : ఇప్పుడే... ఏం చదువుతున్నావు?
నేను : అన్నీనూ.
ఒకాయన : అంటే?
నేను : తెలుగు, సైన్సు, సోషల్, బయాలజీ, మేథ్సు అన్నీనూ.
ఒకాయన : హ హ హ. ఆది కాదు. ఏ తరగతీ అని.
నేన : ఓ అదా... 4వ తరగతి ఎ -సెక్షన్. బాల భాను విద్యాలయం పబ్లిక్ స్కూల్. విశాఖపట్నం.
**
ముందు తెలుగు క్లాసు.
"మనకి మూడు లింగాలు ఉంటాయి.
స్త్రీ, పురుష, నపుంసక లింగాలు." అని మా తెలుగు టీచర్ నాజ్మ బేగం చెప్పారు.
అదే చెత్తో వాడవలసిన ప్రత్యాయాలు కూడా చెప్పారు.
దేన్ని ఎలా సంబోధించాలో తెలిసిన ఆనందంలో స్త్రీ పురుష బేధాలను అదే లింగాలను అన్వయం చేస్కోడం మొదలుపెట్టాను.
తరువాత బయాలజీ క్లాసు.
"మొక్కలు-పువ్వులు. పువ్వులే కాయలవుతాయి. ఆ కాయలే పళ్ళవుతాయి ".
తరువాత సైన్సు క్లాసు.
"వృక్షాలకు కూడా ప్రాణము ఉండునని జె.సి.బోసు కనిపెట్టెను".
**టింగ్ డింగ్. టింగ్ డింగ్. టింగ్ డింగ్.**
ఇంటికి వెళ్ళి, అమ్మ ఇచ్చిన పాలను గ్లాసు కింద జార్చకుండా తాగేసి, మీసాలు తుడుచుకున్నాను.
అమ్మ: 'ఇవాళ స్కూల్లో ఏం ఏం నేర్పించారు శిరీ?'
నేను: అమ్మా.. ఇవాళా.. చాలా చెప్పారమ్మా...
"చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి కూడా పిల్లలుంటాయని, వాటికి కూడా లింగబేధాలుంటాయని.. ఇంకా..."
అని అని అనుకుంటూ ఎవేవో మాట్లాడుతున్న కూతురిని ఒక సారి ముద్దు పెట్టుకుని, శిరీ ఉప్మా తిందువు రా అని పిలిచింది మా అమ్మ.
ఉప్మా లో వచ్చిన ఆనియన్ ని చూసి, అమ్మా.. ఇది మొగదా, ఆడదా అని అడిగాను.
ఏవిటే వాగుతున్నావు? తినూ అని చిన్నగా ఖసిరి, నవ్వుకుంది.
అమ్మా మరి, ఈ ఎర్రగా ఉన్నదాన్ని ఎమనాలి? అని అడిగాను.
కొత్తగా అడుగుతావేంటే? టమాటీ అంటారు. పిచ్చి పిల్లా అని మళ్ళీ వంటింట్లోకి వెళిపోయింది.
నా బుర్రలో తిరుగుతున్న సుడిగుండాలు మొదలైన అనుమానాలను అలాగే కంటిన్యూ చేస్తూ, ఉప్మాలో వచ్చిన మిరపకాయ మిరపకాయి లను పక్కన పెట్టి, టమాటి, టమాటాలను కలుపుకుని ఉల్లిపాయ, ఉల్లిపాయి లను, ఇంకా ఉన్న జంటలను కిందా మీదా చూసి, స్త్రీ అయ్యుంటుందా, పురుషుడయ్యుంటుందా అని అనుకుంటూ తింటున్నాను...
మా అమ్మ పేరు లక్ష్మీ.
మా పెద్దమ్మ పేరు సత్యవతీ.
మా అత్త పేరు పద్మావతీ.
నా పేరు శిరీ.
మా నాన్నగారి పేరు గోపాల కృష్ణ.
మా ఫ్రెండ్ వాళ్ళింట్లో పని చేసేవాడి పేరు వీరయ్య.
అంటే... స్త్రీ లింగం ఐతే, "ఈ" తో ఆపాలి పుల్లింగం ఐతే, "ఆ" తో ఆపాలన్నమాట...!!
**
అమ్మా... ఇవాళ రాత్రికి ఏం కూర చేసావమ్మా?
ఇవాళ బెండకాయి. నీకిష్టం కదా అని... తింటావు కదా?
అది కాదమ్మా... అది బెండకాయి అని నీకెలా తెలుసు? బెండకాయ ఐనా అవ్వొచ్చు కదా? ఎలా పోల్చుకుంటారు?
నా బాధని అర్థం చేస్కున్న మా అమ్మ నాకు తెలిసొచ్చేలా - తెలుగు తెలుగు లాగా, సైన్సు సైన్సు లాగా, సోషల్ సోషల్ లాగా చదవమని నా చెవులు మెలేసి ఉచితమైన సలహా చెప్పింది. :)
గదిలోకి వెళ్ళి నడుం వాల్చబోతూ చెవులు ఎరుపెక్కినా, ఊడిపోయినా, ఈ సంగతేంటో కనుక్కుందాం అనుకునే సమయానికి మళ్ళీ అమ్మ కేక వేసింది.
"శిరీ... శిరీ... "
"ఆ వచ్చె... "
(భా... ఎప్పుడూ ఇంతే... సీరియస్ గా అలోచిస్తూ ఉంటేనే అమ్మకి అన్నీ గుర్తొస్తాయి కాబోలు...
క్యాబేజీ - అన్నీ స్త్రీలే.
దుంపలు - అన్నీ పురుషులే.
పూరీలు - అన్నీ స్త్రీలే.
వంకాయీ వంకాయా... వంకాయీ వంకాయా... అమ్మ్... )
"ఆం... ఏంటమ్మా?"
"ఏవీ లేదే... సుగుణా ఆంటీ వచ్చారు. పాపం నీకు ఇష్టమని స్వీట్ తీస్కొచ్చారు. ఇంద. తిను."
"సచ్చానురా దేవుడా... ఉన్న అనుమానాలే తీరలేదు. అప్పుడే ఇంకో సుగుణా ఆంటీ నా...? ఇప్పుడు 'స్వీట్' స్త్రీ లింగమూ కాదూ... పుల్లింగమూ కాదూ... ఇంకేవిటయ్యుంటుంది చెప్మా??"
యెస్స్స్... నాజ్మా బేగం టీచర్ చెప్పారు కదూ.. నపుంసక లింగమొకటుంటుందని... ఇదే అయ్యుంటుంది కాబోలు.
వెంటనే లాక్కున్నస్వీట్ ని, కొంచెం లాగించి, 'బాగుంది అనాలో బాగున్నాడు అనాలో తెలియక "సుగుణా ఆంటీ... స్వీట్ బాగు బాగు అని అన్నాను...!!"
నా కంఫ్యూషన్ ని సర్కాసం గా అర్థం చేస్కున్న మా అమ్మ ఒక రకంగానూ, అర్థం చేస్కోని సుగుణ ఆంటీ మరో రకంగానూ వికటాట్ట హాసం చేసి, నన్ను పదే పదే ముద్దులాడారు.
Friday, March 5, 2010
Funny origins of English words...
We come across so many words but rarely do we try to correlate why usage of such kinda words.
That was way back in my 5th standard.
My dad gave me the word 'knowledge' and asked me to find all possible anagrams that made use of the only letters present in the given word.
Me having felt positively intriguing, started noting down all the anagrams, with all knowledge that occurred to my mind, then.
God, Know, now, edge, won, WED, new, knew, dog, END.
(Please don’t relate the above words in sequel for a nice story. Hmm. Okay. Fine…!! Go ahead, have some more fun ;))
That laid one of the foundations towards my logophilia.
In the process of formally educating myself through standards VI, VII, VIII, IX, X,
I added many a word to my word-base, this time along with the semantics and origins of words, completely in my own style – interpretation.
Having not lost the habit of finding anagrams, I enjoyed thoroughly every new word I had learnt. Before I realized it as obsession, scrabble only worsened it.
Eventually, obsession subsided a little and now it took a proper shape.
Let me explain a few words, why they might have been designed that way... :)
What is an accident…?
Accident – an unfortunate happening that occurs unintentionally which is most probable to break our teeth: P
Haha.. Makes sense right..? Yeah… also probably because, that’s what the cars n bikes get on them…!! Dents… ;)
What does that mean by a penchant?
Penchant – a strong inclination for something that makes us chant about all the time ;)
Why does smash have mash…?
Smash – to hit or strike something with force that it gets mashed. Don’t know why, but it reminds me of potatoes…!!
What does it mean by coexistent..?
Coexistent – Living together in the same place. May be a tent too ;)
We have homonyms. Consider one for change. See what that meant…
Change – to change one’s clothes that hang in one’s respective wardrobe… ;)
Once, I was surfing through the pages of The Hindu. That was the aftermath of worst-hit tsunami. The only word, I could see almost in every page was: relief. But, the same in page3 caught different part of my cerebrum.
When I encountered this word, relief. It quickly reminded me of guys.
Relief – something that alleviates pain or burden. Yes. Lies… ;) guys do say to their girlfriends, ‘Oh you are beautiful!’ and he is relieved…!! Doesn’t he..?? hehe…;)
Now… do you know why guys ‘encounter’ gals..? Rather, gals, encounter guys…??
Encounter – meeting of two or more people; for that matter, any number of people, till we might’ve lost the count :P now don’t ask me what for…!!
Guess what with sage..?
Sage – a learned person. Why would the age stop till you have finished all learning..? Definitely, sage should have age… don’t ye think so?
Get something kinky… what’s it up to allover..?
Allover –something extending or repeated over the entire surface. That’s why we have lover in it… ;)
Allay –reduce something, usually pain or a problem. What can be the best solution than to lay, may be on bed… :D
It’s now your turn to have fun, finding the anagrams and adding
extra sense to what you actually meant…!!
-sirisha…:)
Thursday, February 18, 2010
కాఫీ కష్టాలు
సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలైంది...
ప్రకృతి పిలుపుకి ఎలా స్పందిస్తారో అలా నాలుగో గంట కొట్టేసరికీ నిద్ర లో నడిచే అలవాటున్నవాళ్ళలా, కుర్చీ నుంచి లేచి,అలా పాంట్రీ దగ్గరకి వెళిపోతారు...
గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే వారు, వీరిలొ ఒక 10సాతం కూడా ఉండరు...!!
ఇంక కప్పుల వేట... మరీ, ఎంగిలి విస్తర్ల దగ్గర కుక్కల్లా అంటే అతిశయోక్తి లా ఉంటుంది. కానీ, ఏ మాత్రం తీసిపోదని సానుభవపూర్వకంగా చెప్పగలను...!!
పంక్తుల వారీగా, కప్పుల కోసం ఎదురుచూసీ, చూసీ, "కాఫీ ఆరోగ్యానికి హానికరం..." వంటి ఆరోగ్య సూత్రాల గురించి కొన్ని అభిప్రాయాలు సేకరించి, ఇంక మరి ఎదురు చూడలేక, కాఫీ ఆలోచన మాని బుద్ధిగా, మంచి నీళ్ళు త్రాగి, "రోజుకి ఎనిమిది లీటర్ల నీళ్ళు తాగాలి అని మా డాక్టరు చెప్పారు.." అని యెదుటవారికంటే, మనకి మనమే సర్దిచెప్పుకునే సమయానికి, "సర్‌ప్లస్" కప్పులు, ర్యాక్ లో ఊడిపడుటుంతాయి...!! "తూ..చ" తప్పకుండ, రేపటి నుంచి "ఎనిమిది లీటర్ల నీళ్ళు" అనే పథకం అవలంబిద్దాంలే అని, ప్రతీ రోజూ కంకణాలు గాజుల్లా కట్టుకుంటూనే ఉంటారు... తాగుబోతు వాగ్దానం ఈ కాఫీ 'తాగే' వారికి కూడ వర్తిస్తుంది అని తెలుసుకున్నాను...!!
ఒక సారి, Q పద్ధతి అవలంబిస్తే ఇంక వద్దన్నా, ముందు వాడు లాగి, వెనకవాడు తోసి, మనల్ని Q మిస్ అవకుండా చేస్తారు. అలాగే ఈ Q పద్ధతి ఆఫీసుల్లో కుడా క్షమించదు...
ఇంత సేపూ కప్పుల కోసం వెయిటింగ్ ఐంది... తర్వాత, కులాయిలకోసం... అదే... "కాఫీ వెండార్ మెషీన్స్" అని ఉంటాయి కదా... అక్కడ...
దానికన్నా ముందు, శుచి, సుభ్రం ఎక్కువైన నా లాంటి వాళ్ళు, ముందు ఒ కప్పుడు వేడి నీళ్ళు పట్టి తెచ్చుకుని, అందిన మట్టుక్కు కాలు అక్కడే Q లో పెట్టి, అందక పోతే, బూట్లు/చెప్పులు పెట్టైనా సరే, Q పోకుండ చూసుకుని, ఈ వెడి నీళ్ళు పారపోస్తారు - కప్పు శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా...!!
కొంత మంది ఎంత భూత దయ గలవారో!! పాపం చలి కాలం కదా అని, మొక్కలకి వేడి నీళ్ళు పోస్తారు. ఇలాంటి దయామయులు చాలానే ఉంటారు... వారి పుణ్యమా అని క్రొత్త క్రొత్త మొక్కలు చూస్తున్నాం 'క్యాంపస్' లో...
అలా చూస్తుంటే, ఒక గోడ మీద ఇది కనిపించింది.
"ఫ్యాక్ట్ ఆఫ్ ద దే: వేడి నీళ్ళు పోస్తే మొక్కలు సచ్చిపోతాయి."
ఇటువంటి ఫ్యాక్ట్స్ రోజుకొకటి రాస్తుంటారు. కానీ ప్రతీ రోజూ అదొక్ఖటే కనిపిస్తుంది అదేవిటో..!! ఐనా సరే..!! సాటి మొక్కల మీద సదరు దయ ఉన్నవాళ్ళు ఇంకా దయామయులుగానే ఉంటారు...
ఆ తర్వాత, ప్రశాంతంగా విడిచిన చెప్పులు మళ్ళి వేసుకుని, నిశ్చింతగా కాఫీ బటన్ ని నొక్కగా వచ్చిన కాఫీ ని, కప్పులో పట్టుకుని, ఇంకా తీరిగ్గా, యేటి గట్టు మీద కూర్చున్న యెంకి లా, ఎక్కడో దూరంగా ఒక అర కిలోమీటరు అవతలనున్న గట్టుమీద కూర్చుని, ప్రశాంతంగా, ఒక సిప్పు వేస్తారు...
అదెవిటో అప్పుడే ఆ ఒక్క సిప్పుకే చల్లారిన కాఫీ అంతా అయిపోయింది...!! కనీసం రెండు గ్రుక్కలన్నా వెయ్యందే కాఫీ తాగినట్టుండదే అని బుర్ర ని, అలా ఆ Q వైపు త్రిప్పుతారు...
అంతే... కథ మళ్ళీ మొదలు...!! :)
Tuesday, July 28, 2009
Chupulu kalasina subhavela…part 1- before
Adentammaa ante… mari. Pelli chupullo alanti patalekada padatharu... sankarabharanam cinema chudaledaa..?? ani kalukk mane vartha cheppindi... :)
Na singledom kingdom lo dom(wn) dom(wn) lu lekunda wisdom kaligiunna queendom tho boredom lekunda seldom rebeldom chupistu... random ga chiefdom, stardom, chefdom latho unnanaku.. inko wifedom ni intha unfreedom tho antagadatharu ani anukoledu...!!
Saree...!! ”do as I say not as I do” ani anonymous peddalu annaru…
Sare.. kanee ani nenu oppukuni… ataka mida undanukunna na sruthi box, na roomlo oka gutlo undani chusi… okasari… namaskarinchukuni…
Sruthi 6 ki set chesi… vara veena-mrudupani ani padadam practice cheddamanukunte..appudee maa annayya TV lo maa music lo vastunna “tolisari mimmalni chusindi modalu…” pata pettadu…
Na sruthi ventane…8 ki set aindi… mari everyone’s Janu, S.Janaki pitch andukovalante..naku pichipattalsinde…!! ;)
Ee prakriyalo… ala na room lo itu atu tiruguthuu… yella tarabadi tudavaka perukunna aidu angulala dummuni oka brown color guddatho tudichanu.. adee na addanni.. endukoo na mukham chuskunnanu… bagunnatte anipinchindi… :-P
Naku photolu teeskodam peddaga istam ledu… kani.. eppudu choosina..ma annaki na cell ichi..oreii..nako photo teeyara…edurugunda kanipinche kobbarichettu na pakkana unnattu ravali… aa building na chevvulaku rings la ravali ani… aakasam na kaalla kinda unnattu padali ani.. ila raka rakalugaa direction..screenplay cheptuntanu.. enni cheppina jarigedhi..origedhi edi undadu… mundu oka bird’s eye undali kada.. aa tarvatha cat’s eye… woman’s eye.. Lord Shiva’s third eye.. unnayo ledo chudochu…
“With the photographer” lesson chinnappudu English lo kaneesam.. nalugu vibhinna taragathullo chadivina gurthu… Tolstoy edo joke chestunnadule anukunna gani.. ila photographers manalnii Toys chesi adukuntadante ’!’ emi ledu.. ’!’ ante ascharyarthakam...
Mottaniki... edo mana kallaku impuga kanipinchetattu tayaravtam.. aa photographergadu adedoo Micheal Adams vadiki panichesinattu feel aipothadu.. chuste.. ma inti pakka sandhulo untadu… badhrapada masam lo pettudu muhurthalaku gullallo pellillu chese contractor ki veedu photographeru…!!
Maree.. ”evi evi” ani… gudi metla daggara jaripoyina kobbarichippakosam kottukune musti vallala kakunda… ”eedi” ani attention pose lo nilabadi... chirunavvuni reverse direction lo sagadeesi, kallallo athuratha kanipinchakunda etoo chustu, laukyam ga adee laukyam expression petti, “chupinchu” ani bold ga adagalanamata…
Ventane.. hickkk hickkkk ani ekkillochai ani… ekkillu techukuntoonee.. alaa hall datenthavaraku naduchukuntu velli… akkadanunchi parigettukuni vantintloki vellali… aa photos ni aturathaga open chestuu ginni..gilaka chappudu cheyyali…
Salman khan aa.. hrithik roshan aa.. aamir khan aa, abhishek bachchan aa ante... nice physique, but short aa, perfect aa, short aa, familiar family background respectively aa ani.. aturathatho chustunna time ke power omphut aipoyindi..!!
Appatikee hall lo andaru chusaru… nenu tappa…!! Vallandaru edoo POSITIVE gane matladukuntunnaru.. sare inkemm ani... ’next step’ ki burra elliptical shape lo round ga oopenu..!! anthe…!! What nexto chudali… ;)
Thursday, May 28, 2009
1-2-3-4-1-2-3-4
Velli.. jana jeevana sravanthi lo kalisipoyee ugravadila nenu kuda ee jana jeevana sravanthi lo vallandaru karche chamatallo teppa veskuni eedi maree kalisipoyanu...
Aa samayamulo.. ma trainer ”are ya warm..??” ani adigadu…
Warm up aithe kani.. exercise lo muligi telalemu kada...
”yeah..!! am hot..!!” ani chepdam anukunna.. appudaina AC penchi...temperature taggistademoo ani… pmch..!! labham lekapoindi…
malli ekkuva alochinche scope ivvakunda… aswaddhama hata: kunjara: type lo yeah.. i am... ani selavichanu...
sampradaya sangeetham... ade.. karanataka sangeetham nerchukunedanni... oka MS Subbu lakshmi, oka Sudha Raghunathan, oka Vani jayaram, lanti valla kovaku chendalanukuni...nirantharamu nidraharalu manakundaa, practice kuda manesi kalalu kantoo poshinchanu na dehanni... atuvanti sangeetham ivala aerobics ki inthaga upayogapadadam bahu anandadayakam.. adelaa ante... laya gnyanam anamata...!! gamanincharoo ledo.. evaraina pata padithe manamu kallatho(legs) chinnaga talam vestu untamu... alage.. bumchikku(aerobics ni telugulo bumchic antaru) class lo vache muzikkuki aa chinnaga vesedi oka padi...iravai inthalu chesi veyyalanamata..!! danni oka steppu antaru...
okaru chaturasram lo steppulu veste.. okaru tisramlo vestaru... marokaru khanda jathi lo vesi... mood ni, mode ni khanda khandaluga vibhajistaru... hasyam aina, lasyam aina laya baddhamga undali ani chinnappudu ma telugu madam nazma begum cheppevaru... ancheta... ma trainer vaipu okka look ichi..."enti sir idi..?? evarikistamaina patalaki vallu steppulestunanru...?? okaru 'aa ante amalapuram ki' inkokaru 'e ooree chinadana ki', marokaru 'chennai chandrama..manase chejare ki'.. verokaru 'idi oka maroo lookam...' ki ila raka rakala songulaki steppulestunnaru...!! andarnee kalisi..'bumchic bum bum cheyyi baga...' ki veyyamandi sir..." ani chevulaku vinapadakundaaa kallatho cheppa.. ayana burratho alochinchi... noti tho.. " okay.. step left.."ani chetini yedamavaipuki chupincharu… adedoo reset button nokkinattu andarooo left ki step vesaru...
taruvatha baruvulu ettistaru... akkadikoche janalu.. samvatsaraniki oka sari...hyderabad nunchi nizamabad ki okkaroju kosam velladaniki sardukunna bag ni kuda kuleelacheta moinchevarilo mottamodathi jathi ki chendinavaru... biceps, triceps, ee-ceps, aa-ceps ani.. asalu.. mana vontlo konni pradesalu evevunnayo... ela upayoga padatayo kuda teliyani moolallo unde muscles(kandaraalu) ni kadipi..kudipi.. kariginchela krushi cheyistadu...
appudanipistuntundi.. evadraa asalu.. krusheevaludu ante raithu ani cheppindi..?? asalu krusheevaludu ante.. aerobics ki vachina software engineeru ani ala ani nighantuvu tiragatrippi vrayalani petition pettadaniki decided... ee decision making ki.. ade decision-making pose lo ante… paiki oka 45degrees angle lo oka 30degrees side ki chustu… kalla mundee kandireega guuuiiinnnn guuuuuiiinnnn mani sound chestunna kallu reppalu veyyakundaa maku telugu nerpinchina maa aa nazma begum madam ni gurtucheskuntooo oka nitturpu viduddamane kshanam lo… "hey.. Sirisha…!! Where are you..? Be in this world and DO" annaru ma trainer…
yeah.. ani ‘ee’ lokam loki vachesi… chinnappatnunche baruvulu badyathalu moyadam alavataina nenu.. tatkalikamaina ee dumbbells nu etti-dinchi-eti-dinchi-etti-dinchi...ila oka iravai sarlu chadavandi… akkadiki weight training poorthavutundi…
yedarilo lo arigipoyina bata cheppulu veskunna yogi vemana sishyudu ‘gali vana lo vana neetilo padava prayanam’ ani aripoyina gontu tho asandarbha geyalu padukuntoo phenyl aina dorikitee veyyi rupayalu petti konukkuni tagudamu ani decide cheskunnavadiki… oka rendu stalls.. coke and pepsi kanipiste… evadi daggaraku vellalo teliyani tikamakalo itu atu itu atu itu atu chusi chusi kallu tirigi padi poye time ki goli soda vadu neellu tagisthe kalige spurthi kalugutundi…endukante… weight training tarvata… padukkuni chese vyayamalu…
“lie down on your back and hug your knees” ani trainer ichina piluputho andaroo vari vari munukulanu gattiga kaugilinchukuni.. oka a.r.rahman duet veskuni… siddhapadatharu…
Aina naa pichi kakapote…!! Padukonichi cheyamannaa, parigetti palu tagamannaa.. aerobics lo anthaa srama cheyinchalane mukhyoddesamee kada... so... ee vyayamalu marintha teevramga untayi… galilo oka rod undanukuni dani mida haayiga kalu chapukoo... pellaina kottha janta vari peddavariki padanamaskaram chestunnattu.. kudi chetto nee padalanu taaku... ani.. ila manalni oka vibhinna prapanchaniki teeskelli cheistaru.. deenipere ABS...
taruvatha pichukalu vati rekkallo durada veste vati mukkulatho gokkodaniki ela vangutayoo...side ki.. ala cheyinchadaniki pichukallo parakaya pravesam cheistaru... deeni pere side crunches... ila palu vidhaluga kaya kastam chesina taruvatha... eppudeppudu "lets catch up tomorrow" ane nalugu englishu mukkalu ma trainer notlonchi vastayaa ani janalanthaa eegalu musurutunnaa noru teruchukuni... doooramga alikidi vini chevulu nikkapoduchukunna kukka laga... bratuku jeevudaa ani padipoyee kallanu(eyes) peddaviga chesi andaruuu ayana moothi vaipee chustuntaru...
bala subrahmanyam padithe chevilo amrutham chukkalu padinattuntundi ani anipinchina vadiki ela untundo teliyadu kani... aa nalugu mukkalu vinna software aerobics do-er ki matram amruthanni thenilo kalipi oka ara kilo panchadhara lo pakam patti, dantlo bellam vesi... oka lehyam tayaru chesi dani paina jeedipappu...badam pappu..pista pappu atikinchi...kissmissulatho missulaki ichinantha sambaramga untundi...
hayyooo raama..!! inthaa aerobics chesina tarvatha ituvanti lehyanni tinte..inka vallu tagginatte...!! god bless me...!! J