Thursday, February 18, 2010

కాఫీ కష్టాలు

అది మా ఆఫీసు లో బ్రేక్ తీసుకునే సమయం...
సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలైంది...

ప్రకృతి పిలుపుకి ఎలా స్పందిస్తారో అలా నాలుగో గంట కొట్టేసరికీ నిద్ర లో నడిచే అలవాటున్నవాళ్ళలా, కుర్చీ నుంచి లేచి,అలా పాంట్రీ దగ్గరకి వెళిపోతారు...

గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే వారు, వీరిలొ ఒక 10సాతం కూడా ఉండరు...!!

ఇంక కప్పుల వేట... మరీ, ఎంగిలి విస్తర్ల దగ్గర కుక్కల్లా అంటే అతిశయోక్తి లా ఉంటుంది. కానీ, ఏ మాత్రం తీసిపోదని సానుభవపూర్వకంగా చెప్పగలను...!!

పంక్తుల వారీగా, కప్పుల కోసం ఎదురుచూసీ, చూసీ, "కాఫీ ఆరోగ్యానికి హానికరం..." వంటి ఆరోగ్య సూత్రాల గురించి కొన్ని అభిప్రాయాలు సేకరించి, ఇంక మరి ఎదురు చూడలేక, కాఫీ ఆలోచన మాని బుద్ధిగా, మంచి నీళ్ళు త్రాగి, "రోజుకి ఎనిమిది లీటర్ల నీళ్ళు తాగాలి అని మా డాక్టరు చెప్పారు.." అని యెదుటవారికంటే, మనకి మనమే సర్దిచెప్పుకునే సమయానికి, "సర్‌ప్లస్" కప్పులు, ర్యాక్ లో ఊడిపడుటుంతాయి...!! "తూ..చ" తప్పకుండ, రేపటి నుంచి "ఎనిమిది లీటర్ల నీళ్ళు" అనే పథకం అవలంబిద్దాంలే అని, ప్రతీ రోజూ కంకణాలు గాజుల్లా కట్టుకుంటూనే ఉంటారు... తాగుబోతు వాగ్దానం ఈ కాఫీ 'తాగే' వారికి కూడ వర్తిస్తుంది అని తెలుసుకున్నాను...!!

ఒక సారి, Q పద్ధతి అవలంబిస్తే ఇంక వద్దన్నా, ముందు వాడు లాగి, వెనకవాడు తోసి, మనల్ని Q మిస్ అవకుండా చేస్తారు. అలాగే ఈ Q పద్ధతి ఆఫీసుల్లో కుడా క్షమించదు...
ఇంత సేపూ కప్పుల కోసం వెయిటింగ్ ఐంది... తర్వాత, కులాయిలకోసం... అదే... "కాఫీ వెండార్ మెషీన్స్" అని ఉంటాయి కదా... అక్కడ...
దానికన్నా ముందు, శుచి, సుభ్రం ఎక్కువైన నా లాంటి వాళ్ళు, ముందు ఒ కప్పుడు వేడి నీళ్ళు పట్టి తెచ్చుకుని, అందిన మట్టుక్కు కాలు అక్కడే Q లో పెట్టి, అందక పోతే, బూట్లు/చెప్పులు పెట్టైనా సరే, Q పోకుండ చూసుకుని, ఈ వెడి నీళ్ళు పారపోస్తారు - కప్పు శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా...!!

కొంత మంది ఎంత భూత దయ గలవారో!! పాపం చలి కాలం కదా అని, మొక్కలకి వేడి నీళ్ళు పోస్తారు. ఇలాంటి దయామయులు చాలానే ఉంటారు... వారి పుణ్యమా అని క్రొత్త క్రొత్త మొక్కలు చూస్తున్నాం 'క్యాంపస్' లో...
అలా చూస్తుంటే, ఒక గోడ మీద ఇది కనిపించింది.
"ఫ్యాక్ట్ ఆఫ్ ద దే: వేడి నీళ్ళు పోస్తే మొక్కలు సచ్చిపోతాయి."
ఇటువంటి ఫ్యాక్ట్స్ రోజుకొకటి రాస్తుంటారు. కానీ ప్రతీ రోజూ అదొక్ఖటే కనిపిస్తుంది అదేవిటో..!! ఐనా సరే..!! సాటి మొక్కల మీద సదరు దయ ఉన్నవాళ్ళు ఇంకా దయామయులుగానే ఉంటారు...

ఆ తర్వాత, ప్రశాంతంగా విడిచిన చెప్పులు మళ్ళి వేసుకుని, నిశ్చింతగా కాఫీ బటన్ ని నొక్కగా వచ్చిన కాఫీ ని, కప్పులో పట్టుకుని, ఇంకా తీరిగ్గా, యేటి గట్టు మీద కూర్చున్న యెంకి లా, ఎక్కడో దూరంగా ఒక అర కిలోమీటరు అవతలనున్న గట్టుమీద కూర్చుని, ప్రశాంతంగా, ఒక సిప్పు వేస్తారు...
అదెవిటో అప్పుడే ఆ ఒక్క సిప్పుకే చల్లారిన కాఫీ అంతా అయిపోయింది...!! కనీసం రెండు గ్రుక్కలన్నా వెయ్యందే కాఫీ తాగినట్టుండదే అని బుర్ర ని, అలా ఆ Q వైపు త్రిప్పుతారు...

అంతే... కథ మళ్ళీ మొదలు...!! :)